భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

82చూసినవారు
హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాల్లో ఆంజనేయస్వామికి సింధూర అభిషేకాలు నిర్వహించిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున స్వామివారి ఉత్సవాన్ని రథంపై ఉంచి గ్రామ పురవీధుల్లో భజన, మేళతాళాలతో రథోత్సవం నిర్వహించారు. ఇంటి ముంగిటకు వచ్చిన స్వామి వారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్