మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 45 వార్డు ఫైర్ స్టేషన్ దగ్గర గత మంగళవారం కూలిపోయిన ఇండ్లను గురువారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. గతంలోనే చెప్పినా ఇప్పటి వరకు ఎందుకు కూలిపోయిన ఇండ్ల వ్యర్థాలను తొలిగించ లేదని ఆయన మున్సిపల్ సిబ్బందితో మాట్లాడారు. ఇక్కడ ఉన్న వార్డు ఆఫీసర్ ఎవరు అని ఆయన ప్రశ్నించారు. వీలైనంత త్వరగా కూలిపోయిన ఇండ్ల వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు.