దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలో కురుస్తున్న వర్షాలు కెఎల్ఐ ద్వారా వస్తున్న నీటితో రావులపల్లి, నిజాలపూర్, గౌరిదేవిపల్లి చెక్ డ్యాంలు నిండి కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కందూరు పెద్దవాగుపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ తొలిసారి నిండి అలుగు పారుతోంది. దీంతో వాగు పరిసర ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్ జాతీయ రహదారి 44కు సమీపంలో ఉన్నందున రహదారిపై వెళ్తున్న వారిని కనువిందు చేస్తోంది.