కోయిల్ సాగర్ మూడు గేట్లు ఎత్తివేత

65చూసినవారు
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం 3 గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. ఉదయం 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా.. ఇన్ ఫ్లో పెరగడంతో మధ్యాహ్నం మరో గేటు తెరిచి 2, 100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పెద్దవాగు ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32. 6 అడుగులు కాగా, ప్రస్తుతం 32. 2 అడుగులుగా ఉంది.

సంబంధిత పోస్ట్