అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫత్తేపూర్ లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం పారదర్శకత పాటిస్తుందన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులతో గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్న తీరు ప్రజా పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు.