మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీ కీలక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర హాజరయ్యారు. అస్పత్రిలో సమస్యలు, చేయాలవలసిన అభివృద్ధి, కావాల్సిన నిధులపై చర్చించారు. అస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. వచ్చే నాలుగేళ్లలో ద బెస్ట్ మహబూబ్ నగర్ అస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఎంపీ డీకే అరుణ అన్నారు.