మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఇసుక అక్రమ దందా ఆగడం లేదని సామాజిక కార్యకర్త డిండి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం పట్టపగలే భారత్ బెంజ్, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోవట్లేదని అన్నారు. గతంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిన వారి ఆదేశాలను స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని డిండి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.