జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని పులికల్ గ్రామంలో కొత్త ఎస్సీ కాలనీలో మంగళవారం కొత్త ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. గత 3 రోజులుగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించినవారు అధికారులతో మాట్లాడి 25 కే. వి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయించారు. మంగళవారం కాలనీలో విద్యుత్తును వెలిగించారు.