జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెదురు బొంగులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.