గద్వాల్: ఎస్సైని అభినందించిన డీజీపీ జితేందర్

75చూసినవారు
గద్వాల్: ఎస్సైని అభినందించిన డీజీపీ జితేందర్
పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీలో జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచి డీజీపీ జితేందర్ చేతుల మీదుగా మంగళవారం ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లా పరిధిలో ఏప్రిల్ 2023 నుండి అక్టోబర్ - 2024 వరకు జిల్లా వ్యాప్తంగా 948 సెల్ ఫోన్లను గుర్తించి, స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగింది అన్నారు.

సంబంధిత పోస్ట్