గద్వాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు గోవింద్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే త్యాగం వల్లే మహిళలు, వెనుకబడిన వర్గాలు విద్యా రంగంలో రాణించగలుగుతున్నారన్నారు.