డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని జిల్లాల వారీగా ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు చేయాలని మంగళవారం డీసీసీ కమిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష, కార్యదర్శులు, కలెక్టర్లకు దరఖాస్తులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో త్వరలో సొంతంగా డీసీసీ కార్యాలయాలు ఏర్పడనున్నాయి.