జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం వారాంతపు కూరగాయల సంత జరుగుతొంది. మార్కెట్ కు ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్ల పైనే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో గతంలో ఒకసారి తీవ్ర రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ ను ప్రత్యేక స్థలం కేటాయించి మరో ప్రాంతానికి తరలించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.