మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అమ్రాబాద్ మండలంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికుల వివరాల ప్రకారం. తిర్మాలపూర్ గ్రామస్థులు జీపులో వెళ్తుండగా ఆదివారం గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై పెద్దపులి కనిపించింది. దీంతో కొద్దిసేపు వాహనాన్ని అక్కడే ఆపేశారు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన పులి కాసేపటి తర్వాత తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. కాగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.