ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

352చూసినవారు
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
మిడ్జిల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బస్ స్టాండ్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జర్నలిస్ట్ బండి అజయ్ కుమార్ ముదిరాజ్ ను కిడ్నాప్ చేసి దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డి మరియు అతని అనుచరులపై కిడ్నాప్ కేసు మరియు హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు. ముదిరాజ్ కులం గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలన్నారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మిడ్జిల్ ముదిరాజ్ సంఘం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్