మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షం లేకపోవడంతో తీవ్ర ఎండ ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఇంటికి చేరుకునే కళాశాల, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఇబ్బందులు పడ్డారు. కాగా వేరుశనగ సాగుకు ఈ వర్షం అనుకూలంగా మారిందని రైతులు పేర్కొన్నారు.