జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం గంగాధర్ పల్లి గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనానికి బుధవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.