గత ఏడాది కంటే క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని, కాని మహబూబ్ నగర్ జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని జిల్లా ఎస్పీ డి. జానకి ధరావత్ అన్నారు. ఆదివారం వార్షిక క్రైమ్ రిపోర్ట్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ. 2022లో 6, 519, 2023లో 5, 869 కేసులు నమోద అవ్వగా, ఈ ఎడాది 5, 887 కేసులు నమోదయ్యాయన్నారు. అత్యధికంగా జడ్చర్ల పీస్లో 913, అత్యల్పంగా మహబూబ్ నగర్ మహిళా పీస్లో 130 కేసులు నమోదైనట్లు తెలిపారు.