సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ అస్పత్రికి కోమాలో ఉన్న శ్రీతేజ ను మంగళవారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. అనంతరం డీకే అరుణ అస్పత్రి వైద్యులతో మాట్లాడి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఘటన జరిగిన నాటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి రమేష్ మనోధైర్యం కల్పించారు. శ్రీతేజ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.