రాజీ మార్గమే రాజమార్గమని ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వాహణ, వైవాహిక, బ్యాంకు, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, ఇతర రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.