పాలమూరులో కొండెక్కిన కూరగాయల ధరలు

63చూసినవారు
భారీ వర్షాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఓ వైపు నిత్యావసర ధరలు, మరో వైపు కూరగాయల ధరలతో పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలమూరు జిల్లాలో గురువారం టమాటా కేజీ రూ. 100, ఉల్లిగడ్డలు రూ. 50, వంకాయలు రూ. 80, బీరకాయలు రూ. 80, ఆలుగడ్డలు రూ. 80 పైనే ఉండటంతో కూరగాయలు కొనే పరిస్థితి లేక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలను అదుపులోకి తేవాలని జనం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్