యువత ఆర్థికంగా ఎదగాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆకాంక్షించారు. జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో ఓ హోటల్ ను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి యువత ఏదో ఒక పని చేస్తూ ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.