పిడుగుపాటుతో ఆవు, గొర్రెలు మృత్యువాత

74చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలంలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఈ సందర్భంగా పిడుగుపాటుతో ఆవు, మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని నిజాంబాద్ గ్రామానికి చెందిన లింగమయ్య అనే రైతుకు చెందిన పాడి ఆవుతో పాటు పాపయ్య అనే గొర్రెల కాపరికి చెందిన మూడు గొర్రెలు మృతిచెందాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్