అంబులెన్స్‌లో ఓ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన నాగలక్ష్మికి పురిటి నొప్పులు అధికమవడంతో భర్త శివ కుమార్ 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. 108 సిబ్బంది ఈఎంటి మెహబూబ్ భాష పైలెట్ శివశంకర్ టంకర గ్రామానికి చేరుకొని నాగలక్ష్మి అంబులెన్స్ లో తీసుకుని, హాస్పిటల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో మగ బిడ్డకి జన్మనిచ్చారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపింది.