అక్రమంగా ఇసుక మాఫియా

350చూసినవారు
అక్రమంగా ఇసుక మాఫియా
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తున్న సమయంలో పలు ఆంక్షలు ఉన్నప్పటికీ ఇందుకు విరుద్ధంగా కొందరు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతున్నారు. మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేసి సొమ్ము కాజేస్తున్నారు. వివరాలలోకి వెళితే ఉమ్మడి మండల పరిధిలోని గోకారం ఎర్రవెల్లి గ్రామ శివారులోని వాగుల నుండి అర్ధరాత్రి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి ట్రాక్టర్ కు 5000, 6000 చొప్పున అమ్మకం చేస్తున్నారు.

దీనితో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2000 నుండి 3000 వేల వరకు అమ్మే ఇసుక డబల్ ధరలకు అమ్ముతున్నారని ఓవైపు సిమెంట్ సైతం ఐదు వందల రూపాయలు ధర పలుకుతున్న వేల చిన్నాచితక పనులు చేపట్టే వారికి ఆర్థిక భారంతో కుంగి పోతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక బకాసురుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలో ఇసుక రవాణాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ఎవరైనా ఇసుక అక్రమ రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సైదులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్