మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లోని బాత్‌రూమ్ వద్ద ఓ యువకుడు మరోసారి వీడియో రికార్డ్ చేసినట్లు శనివారం విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీంతో కాలేజీ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థినులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. పోలీసులు నవీన్ అనే యువకుడిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.