మాగనూర్ లోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలమూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు తిరుపతి రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అక్కడ వున్న డాక్టర్లను విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు.