ఏపీ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల మహబూబ్ నగర్ ఎంపీ అరుణ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించిన వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.