నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో నూతన అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గం ఏర్పడింది. నూతన అధ్యక్షుడిగా రంగమోళ్ల దశరథ్, ప్రధాన కార్యదర్శి సహదేవ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. గ్రామస్థాయిలో అంబేద్కర్ సంఘాలను నిర్మాణం చేసుకోని ప్రజలను అంబేద్కర్ అలోచన విధానాన్ని ముందుకు తీసుకెల్తామని సూచించారు. సంఘం మాజీ సభ్యులు, పెద్దలు, యువకుల సహకారంతో సమిష్టి భాద్యతగా పని చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా భీంరాజ్, రాజు, కోశాధికారిగా బాల్ రాం, ఆర్. రాజ్ కుమార్, భరత్, తిమ్మప్ప, జగదీష్, వెంకటేష్ తదితరులు కార్యవర్గం లో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కే.చిన్న, తిమ్మప్ప, దుర్గం శ్రీనివాస్, గోపాల్, డి. నర్సింగప్ప, గురునాధ్, నారాయణ, పి. నారాయణ, ఆర్. హన్మంతు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.