ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ చేపట్టడంతో పాటు హైదరాబాద్లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జేఏసీ వెల్లడించింది. హైదరాబాద్లో గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన రాష్ట్ర సదస్సులో ఈ మేరకు ప్రకటన చేశారు.