కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకులు నామాజీ విమర్శించారు. బుధవారం మక్తల్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఛార్జ్ షీట్ ప్రజల ముందు ఉంచామని అన్నారు. యేడాది కాంగ్రెస్ పాలన ప్రజలకు తెలిసిపోయిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.