మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం మక్తల్ శాఖ ఆద్వర్యంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి ఖేల్ కూద్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం సరదాగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఖేల్ కూద్ పోటీల్లో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.