మక్తల్ పట్టణంలోని సుప్రసిద్ధ ఆలయం శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పావని మున్సిపాలిటీ కార్యాలయం నుండి బజంత్రీలతో పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.