అంబులెన్స్ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న గర్భిణీలు

4397చూసినవారు
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామానికి 102 అంబులెన్స్ వాహనం రాకపోవడంతో సుమారు 30 మందికిపైగా గర్భిణి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నెల నెలా పరీక్షల కొరకు మండల పరిధిలోని పులిమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతి నెల పరీక్షల నిమిత్తం 102 అంబులెన్స్ వాహనంలో తీసుకెళ్ళాల్సి ఉండగా ఫోన్లు చేసిన స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్