ఆయిల్ పామ్ సాగు రైతులకు అధిక లాభాలు అర్జించే సమయం ఆసన్నమైందని ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాగర్ కర్నూలు జిల్లా ఏరియా మేనేజర్ రాకేష్ అన్నారు. గురువారం ఉప్పునుంతల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అనుసంధానంతో ఫ్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.