పెండింగ్ పాల బిల్లులు 60 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కల్వకుర్తి పాడి రైతులు గురువారం పాలాభిషేకం చేశారు. తమ సమస్యలు పరిష్కరించిన ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, విజయ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ పాల బిల్లులు కూడా అక్టోబర్ ఆరు లోపట విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.