ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ నుండి గూగుల్ మెట్ ద్వారా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే అర్హత ప్రమాణాలు, విధానాలను అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల మార్గదర్శకాలపై వివరించారు.