నారాయణపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో రైతులు తాము పండించిన కూరగాయలను రోడ్డుపై కూర్చొని అమ్మకాలు చేయడంతో కూరగాయలు కొనేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ప్రత్యేకంగా కట్టించిన రైతు బజార్ నిరుపయోగంగా మారింది. అధికారులు రైతులకు అవగాహన కల్పించి రైతు బజార్ లో విక్రయాలు జరిగేలా అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కూరగాయల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.