నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని..జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ సూచించారు.తెలకపల్లి మండల పరిధిలోని రఘుపతిపేట వద్ద దుందుభి నదివాగు ప్రవాహాన్ని పరిశీలించారు.వాగు దాటే ప్రజలకు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాగు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులకు సూచించారు.మత్సకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.