తెల్లవారుజామున నుండి పట్టణంలో పారిశుధ్య పనులు చేసే కార్మికుల సేవలు గొప్పవని కమిషనర్ సునీత అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.