నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

1101చూసినవారు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూజారి మల్లప్ప ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. 8 లక్షల విలువ గల 8 క్వింటాళ్ల సీడ్స్ సీజ్ చేసి నరసప్ప పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్