‘కల్కి 2898 ఏడీ’సినిమా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు సంగీత దర్శకుడు సంతోశ్ నారాయణన్. ఈ మూవీ మ్యూజిక్ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను టీమ్ విడుదల చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంకా హవా కొనసాగుతోంది.