లైంగిక దాడి కేసులో ఇటీవల బెయిల్ పై బయటకి వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నుంచి 20 రోజుల్లో అసలు నిజాలు బయటపడతాయని తెలిపారు. తనతోపాటు కుటుంబ సభ్యులను కుట్ర చేసి ఇరికించిన వారంతా బయటకు వస్తారని వ్యాఖ్యనించారు. తానేం నేరం చేయలేదని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు.