దన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పట్టణ అధ్యక్షుడు లక్ష్మయ్య గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి పేద ప్రజల ఆకలి తీర్చారని చెప్పారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు.