పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేట పట్టణంలో PDSU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ. నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.