వర్షాకాలం నేపథ్యంలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా కోయిలకొండ మండలం పెర్కివీడులో మంగళవారం గూంజ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా నిరుపేదలకు సరుకులు పంపిణీ చేస్తామని వారు చెప్పారు. కార్యక్రమంలో గూంజ్ సంస్థ మండల అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, వరదాస్, నరేష్, కేశవులు, వంశీ తదితరులు పాల్గొన్నారు.