నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 247 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల పరిదిలో రేపటి నుండి రెండు రోజుల పాటు మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వహక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. మరికల్ వద్ద నాలుగు చోట్ల పైప్ లైన్ లీకేజీ కారణంగా వాటిని తొలగించి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.