నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని మొగలమడక గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని మూడవ శనివారం సందర్భంగా శ్రీ వీరాంజనేయ ఆలయ జల్లిబింద కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి జల్లి బిందె కార్యక్రమం పెద్ద ఎత్తున ఆనవాయితీగా జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు.