కృష్ణా నది తీర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల మత్స్యకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ కారణంగా వరదలు పోటెత్తి ప్రమాదం ఉండడంతో ఆయా జిల్లాల వారీగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.