తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ ను హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు చెప్పారు.